కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు పరిష్కారం!

కళ్ల నుంచి నీరు కారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అలెర్జీలు, కనురెప్పల వాపు కంటిలో ఏదైనా గాయం, లేదా కన్నీటి నాళాలలో అడ్డంకులు వంటివి దీనికి కారణం కావచ్చు. కళ్ళపై వెచ్చని కంప్రెస్ పెట్టుకోవడం వల్ల కంటి చికాకు తగ్గుతుంది. కళ్ళు పొడిబారడం లేదా మంట ఉంటే, డాక్టర్ కంటి చుక్కలు సూచించవచ్చు. అలెర్జీ వల్ల కళ్ళు నీరు కారుతున్నట్లయితే, అలెర్జీ మాత్రలు లేదా కంటి చుక్కలు సహాయపడతాయి. కళ్ళ చుట్టూ ఉన్న పొరను శుభ్రం చేయాలి.

కళ్ళు నిరంతరం నీరు కారుతుంటే లేదా మీకు చూపులో ఇబ్బంది ఉంటే మీ డాక్టర్‌ను సంప్రదించండి. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళ నుంచి నీరు కారడం, కళ్ళమంట వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే, అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను చూడడం వల్ల కళ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తగినంత విశ్రాంతి లేక కళ్ల చుట్టూ నల్ల వలయాలు ఏర్పడుతాయి.

బడలికగా ఉన్నప్పుడు కీరదోసను కళ్లపై పెట్టుకోవాలి. కీరదోసలోని కూలింగ్‌ గుణాల వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి. రాత్రి నిద్ర పోయే ముందు నువ్వులనూనె/బాదం నూనెను కళ్ల చుట్టూ మసాజ్‌ చేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలు, ముడతలు పోతాయి. బంగాళదుంప ముక్కలను గుండ్రంగా కోసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి రెండు కళ్ల మీద కాసేపు పెట్టుకుంటే కళ్ల ఉబ్బరింపు, దురదలు తగ్గుతాయి.

వాయు కాలుష్యం కూడా కొంతమందిలో కన్నీటికి కారణం కావచ్చు. కంజెక్టివైటిస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కన్నీరు ఆగకుండా కారే సమస్యకు దారి తీయొచ్చు. కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లలో నీరు కారుతుంది. కండ్లకలక వంటి బాక్టీరియల్ లేదా వైరల్ కంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లలో నీరు కారుతుంది. కన్నీటి నాళాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా కళ్లలోంచి నీరు కారుతుంది.. కారణమేమిటో గుర్తించి చికిత్స తీసుకోవాలి.