ముల్తానీ మట్టి చర్మానికి రాయడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. అందంగా కనిపిస్తారా?

అమ్మాయిలలో చాలామంది ముఖానికి ముల్తానీ మట్టి రాయడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్ తో పాటు డోలమైట్ కూడా ఉంటుంది. అందం కోసం పరితపించే వాళ్లు ఈ ముల్తానీ మట్టిని వాడటం ద్వారా అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేని ఈ మట్టి చర్మానికి రక్షణ కలిగిస్తుంది.

పాకిస్థాన్ లోని ముల్తాన్ ప్రాంతంలో లభించే మట్టి కాబట్టి ఈ మట్టికి ముల్తానీ మట్టి అని పేరు వచ్చింది. పొడి రూపంలో వేర్వేరు రంగులలో ఉండే ముల్తాని మట్టి క్రిమి నాశక లక్షణాలను సైతం కలిగి ఉంటుంది. ముల్తానా మట్టిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముల్తానీ మట్టి జిడ్డును గ్రహించడంలో ఎంతగానో సహాయపడుతుంది. జిడ్డులా ఉండే నూనెలను ఈ మట్టి సులభంగా పీల్చే అవకాశాలు ఉంటాయి.

ఈ మట్టి చర్మం యొక్క సహజ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది. ముల్టానా మట్టి,రోజ్ వాటర్,గంధం పొడి సమానంగా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడంలో ఈ మట్టి తోడ్పడుతుంది. ఈ మట్టి వాడటం వల్ల చర్మం రంగు మిలమిలా మెరిసే అవకాశం ఉంటుంది.

చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టడంలో ఈ మట్టి ఉపయోగపడుతుంది. చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో ముల్తాని మట్టి ఉపయోగపడుతుంది. జుట్టు చివర చిట్లుటను తగ్గించడంలో ఈ మట్టి సహాయపడుతుంది. ముల్తానీ మట్టిని వాడటం వల్ల సులభంగా నిటారైన జుట్టును పొందవచ్చు. అలిసిన అవయవాలకు ఉపశమనం కలిగించడంలో, మృత కణాలను తొలగించడంలో ముల్తానీ మట్టికి ఏదీ సాటిరాదని చెప్పవచ్చు.