ఈ మధ్య కాలంలో ఏ హోటల్ లో చూసినా ఫుడ్ రుచిగా ఉండటం కోసం టేస్టింగ్ సాల్ట్ ను వినియోగించడం జరుగుతోంది. అజినోమోటో అని పిలిచే టేస్టింగ్ సాల్ట్ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టేస్టింగ్ సాల్ట్ తో చేసిన వంటకాలను తింటే నాడీ వ్యవస్థ బలహీన పడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
పార్కిన్సన్స్ లేదా అల్జీమర్స్ వ్యాధులకు కూడా టేస్టింగ్ సాల్ట్ కారణమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టేస్టింగ్ సాల్ట్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినే వారికి సాధారణ వంటకాలతో చేసే వంటకాల రుచులు సైతం సులువుగా నచ్చవు. టేస్టింగ్ సాల్ట్ తీసుకునే వ్యక్తులు త్వరగా చిరాకు పడటంతో పాటు వాంతులు, తలనొప్పి, నొప్పులు, అలసట, ఛాతీపై ఒత్తిడి మరియు గొంతులో, అర చేతుల్లో లేదా అరికాళ్ళలో మంటలు ఇతర సమస్యల బారిన పడతారు.
అజినోమోటో రుచిని పెంచుతుంది కానీ గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. టేస్టింగ్ సాల్ట్ ను తరచూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని చెప్పవచ్చు. దేశంలో అమ్ముడవుతున్న పొటాటో చిప్స్‌లో, ఫ్రైడ్ చికెన్ లో పరిమితికి మించి టేస్టింగ్ సాల్ట్ ను వాడుతున్నారని తెలుస్తోంది. టేస్టింగ్ సాల్ట్ ను వాడని రెస్టారెంట్లు దాదాపుగా ఉండవనే చెప్పాలి.
పరిమితికి మించి అజినోమోటో వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని టేస్టింగ్ సాల్ట్ వాడని రెస్టారెంట్లలో ఫుడ్ తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టేస్టింగ్ సాల్ట్ ను తరచూ తీసుకునే వాళ్లు దీని వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి తెలుసుకుంటే దీంతో తయారు చేసిన వంటకాలకు దూరంగా ఉంటారని చెప్పవచ్చు.