రూ.1000 పెట్టుబడితో నెలకు రూ.30 వేల ఆదాయం.. సులువుగా ఎలా పొందాలంటే?

ఇప్పుడున్న సమాజంలో చాలామంది ప్రజలకు వ్యాపారాలు చేయాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. గంటలు తరబడి ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా ఆదాయం అంతంతే ఉంటుంది. అదే సమయం వ్యాపారాలలో కేటాయిస్తే రెట్టింపు ఆదాయం సొంతం చేసుకోవచ్చు. అందుకే చాలామంది బిజినెస్ ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

 

ఇక బిజినెస్ లు చేయాలన్నా కూడా అంత మామూలు విషయం కాదని చెప్పాలి. దానికి తగ్గట్టు పెట్టుబడి ఉంటే రారాజులం అవుతాం. లేదంటే ఊహలతోనే బతకాల్సి ఉంటుంది. అందుకే చాలామంది పెట్టుబడి పెట్టే స్తోమత లేక తప్పనిసరిగా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి. దానివల్ల లాభాలు మాత్రం ఎక్కువగా వస్తాయని చెప్పాలి.

 

ప్రస్తుతం వ్యాపారంలలో ఎక్కువగా ఫుడ్ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లపై ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ లు బాగా కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడి తక్కువ పెట్టి ఆదాయం ఎక్కువగా అందుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ లో రకరకాల పదార్థాలు తయారుచేసి అమ్మవచ్చు. అందులో ఒకటి బంగాళదుంప చిప్స్. ఈ బంగాళదుంప చిప్స్ కు డిమాండ్ చాలా ఎక్కువ ఉందని చెప్పాలి.

 

చాలా తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. చిప్స్ తయారు చేయడానికి మెషిన్ కేవలం రూ.850 కే దొరుకుతుంది. ఇక ముడి పదార్థాలపై కొంతవరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మొదట్లో 100 రూపాయల నుంచి 200 వరకు ధరలోనే ముడి సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆ మెషిన్ పెట్టడానికి కూడా స్థలం ఎక్కువగా అవసరం పడదు.

 

ఈ మెషిన్ పనిచేయడానికి కరెంటు కూడా అవసరం లేదు. కాబట్టి దీనిని ఇంటి ముందు చిన్న బండి రూపంలో లేదా ఏదైనా స్టాల్లో అమ్మడం ప్రారంభించవచ్చు. అలా రోజుకు 10 కిలోల చిప్స్ అమ్మితే వెయ్యి రూపాయలు పొందవచ్చు. అలా నెలకు రూ. 30 వేల వరకు లాభాలు అందుకోవచ్చు.