చుండ్రు సమస్యతో తరచూ బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు రాదంటూ?

మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో చుండ్రు ఒకటి కాగా ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఇబ్బంది పడేవాళ్లకు మాత్రమే ఈ సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేపాకుల సహాయంతో చుండ్రుకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.

వేపాకు డాండ్రఫ్ పెరుగుదలకు కారణమయ్యే ఫంగస్ కు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. ​ ఆపిల్ సీడర్ వెనిగర్‌ కూడా చుండ్రు సమస్యకు చెక్ పెట్టే విషయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చుండ్రు వల్ల వచ్చే దురదను తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుందని చెప్పవచ్చు. వారానికి ఒకసారి అయినా షాంపూతో తలస్నానం చేయడం మంచిది.

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతో కూడా చుండ్రుకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆస్పరిన్ ట్యాబ్లెట్లను ముక్కలుగా చేసి అందులో షాంపూ కలిపితే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చుండ్రు వల్ల జుట్టు రాలడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చుండ్రు వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

చుండ్రు సమస్యకు ఈ చిట్కాలు పాటించినా పరిష్కారం లభించని పక్షంలో వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు. చుండ్రు విషయంలో నిర్లక్ష్యం తగదని వైద్యులు సైతం సూచనలు చేస్తున్నారు. మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలే సమస్య తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు.