Fish Venkat: నటుడు ఫిష్ వెంకట్ ఈ పరిస్థితికి ఆ తప్పే కారణమా.. ఏం జరిగిందంటే?

Fish Venkat:  సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్నారు అయితే ప్రస్తుతం ఈయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం ఈయన పరిస్థితి పూర్తిగా విషమించిన నేపథ్యంలో వైద్యం కోసం ఎవరైనా సహాయం చేయాలి అంటూ తన భార్య బిడ్డలు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈయన తన భార్య బిడ్డలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితులలో ఉన్నారు. ఇలా ఫిష్ వెంకట్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తోంది.నాలుగేళ్ల క్రితం మద్యం కారణంగా షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్ వచ్చాయి. ఆ సమయంలో సినీ ప్రముఖులు, దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి.

ఆపరేషన్ తరువాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో వెంకట్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు అయితే ఆరోగ్యపరంగా ఈయన మద్యం సిగరెట్ మానేయాలని డాక్టర్లు చెప్పినప్పటికీ తిరిగి ఆయన స్నేహితులతో కలిసి మద్యం సిగరెట్లు వంటివి తాగడం మొదలుపెట్టారని అందుకే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేశారని.. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవ్వరూ చూడటానికి కూడా రావడం లేదని వాపోయారు.

తన భర్త ఆరోగ్యం కోసం ఎలాగైనా దాతలు సహాయం చేయాలని అలాగే సినీ పెద్దలు కూడా తన భర్త సహాయం కోసం అండగా నిలవాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. అయితే గతంలో ఈయన అనారోగ్య సమస్యలకు గురి కావడంతో సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచిన విషయం తెలిసిందే.