మద్యం సేవించే సమయంలో స్నాక్స్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాటి వల్ల ఇంత ప్రమాదమా?

పురుషులలో చాలామంది మద్యం తాగడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ఈ అలవాటు మంచిది కాదని తెలిసినా కొంతమంది ఈ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. మద్యం సేవించే సమయంలో స్నాక్స్ తినడానికి కొంతమంది ఎంతగానో ఇష్టపడతారు. మరి మద్యం తాగడం మంచిదా? చెడ్డదా? అంటే వైద్యులు మద్యం తాగడం వల్ల నష్టమే అని చెబుతున్నారు. మద్యం సేవించే సమయంలో వేడి శనగ, జీడిపప్పులు ఎక్కువమంది ఇష్టంగా తింటారు.

ఈ పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికంగా అధికంగా ఉండటం వల్ల మరీ ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకున్న వాళ్లు వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. మద్యం సేవించే సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.

పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్కాహాల్ సేవిస్తున్న సమయంలో లేదా ఆ తర్వాత కూడా తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి మత్తు వల్ల నియంత్రణ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మద్యం తాగిన సమయంలో వీటిని తీసుకోవడం మంచిది కాదు.

మద్యం తాగే సమయంలో ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మద్యం తాగేవాళ్లు బ్రెడ్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్-గుండె మంట ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.