వంటల కోసం పామాయిల్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ నూనె వల్ల ఇంత ప్రమాదమా?

సాధారణంగా ఇతర వంట నూనెలతో పోల్చి చూస్తే పామాయిల్ ఖర్చు తక్కువనే సంగతి తెలిసిందే. లీటర్ పామాయిల్ ఖరీదు 100 రూపాయల కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం. తరచూ పామాయీల్ వాడితే మాత్రం కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా పామాయిల్ ను వాడటం జరుగుతుంది. పామాయిల్ ఎక్కువగా వాడితే ఫ్యాటీ లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి.

పామాయిల్ లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయం, కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పామాయిల్ 50 శాతం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను కంప్రెస్ చేస్తుంది. పామాయిల్ ఎక్కువగా వాడటం ద్వారా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పామాయిల్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అథెరోస్కిరోసిస్ రిస్క్ ను పామాయిల్ పెంచుతుందని చెప్పవచ్చు. పామాయిల్ తీసుకోవడం ద్వారా ఆకలి పెరగడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాక్లెట్స్ తయారీలో కూడా పామాయిల్ ను ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్ లో దొరికే చిప్స్ కూడా పామాయిల్ తోనే ఎక్కువగా తయారు చేస్తారు. పామాయిల్ లో ఎక్కువ క్యాలరీలు ఉండటం వల్ల సులువుగా లావయ్యే ఛాన్స్ ఉంటుంది.

మద్యం, స్మోకింగ్ వల్ల కలిగే నష్టాలతో పోల్చి చూస్తే పామాయిల్ ను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పామాయిల్ ను వాడవద్దని వైద్యులు సైతం సూచనలు చేస్తున్నారు. తరచూ పామాయిల్ ను వాడే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పామాయిల్ వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.