తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ వేతనంతో మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆగష్టు నెల 25వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ నెల 19వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన సంస్థలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్స్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సును పూర్తి చేసిన వాళ్లు మాత్రం సంవత్సరం పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ,, ఈఎడబ్ల్యూఎస్, ఎస్క్ సర్వీస్ మేన్, ఎన్.సీ.సీ సర్ట్ఫికెట్ ఉన్న అభ్యర్థులకు మూడేళ్ల చొప్పున వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉండనున్నాయి. హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 31040 రూపాయల నుంచి 92,050 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయలుగా ఉంది.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ప్రాథమిక పరీక్ష కేంద్రాలుగా ఉండనున్నాయని తెలుస్తోంది. వయో పరిమితి సడలింపులు ఉన్న అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు వచ్చే నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.