Chandrababu : వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిన రెండు వేర్వేరు ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

1. కాకినాడ జీజీహెచ్ (GGH) ఘటన
తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి. ఆమెకు పాంటాప్రోజోల్ (Pantoprazole) ఇంజెక్షన్ పడదని, బీపీ, షుగర్ ఉన్నాయని కేస్ షీట్‌లో స్పష్టంగా రాసి ఉంది. అయినప్పటికీ, నవంబర్ 20న ఓ పీజీ వైద్య విద్యార్థిని అదే ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇంజెక్షన్ వికటించి బాధితురాలికి ఫిట్స్, గుండెపోటు వచ్చి మరణించారు.

2. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ఘటన
కాలం చెల్లిన (Expiry Date) మందులను రోగులకు పంపిణీ చేశారు.  2025 అక్టోబర్‌తో గడువు ముగిసిన మందులను, నవంబర్ 8న ఓ 55 ఏళ్ల రోగికి ఇచ్చారు. ఆ మందులు వాడిన తర్వాత సదరు రోగి ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు కింది ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులైన వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కాకినాడలో మృతి చెందిన మల్లేశ్వరి కుటుంబానికి తక్షణమే సాయం అందించాలి. భవిష్యత్తులో ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.

ఐబొమ్మ సవాల్ || Journalist Bharadwaj EXPOSED iBomma Ravi Vs CP Sajjanar || IBOMMA Ravi Case || TR