గోమూత్రం తాగడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

ప్రస్తుత కాలంలో మనుషులను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని జంతువులలో గోవుకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఆవు నుంచి వచ్చే మూత్రం పంచామృతాలలో ఒకటి కాగా మన శరీరంలోని ఎన్నో వ్యాధులకు కారణమైన మలినాలకు చెక్ పెట్టడంలో గోమూత్రం ఉపయోగపడుతుంది. గోమూత్రంను ఆయుర్వేదంతో పాటు ఔషధాల తయారీలో సైతం వినియోగిస్తారు.

చేదుగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. వాత పిత్తాలను సమతౌల్యం చేయడంలో గోమూత్రం ఎంతగానో తోడ్పడుతుంది. గోమూత్రం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గోమూత్రంలో విటిమిన్ ఎ, బి, డి, ఈతో పాటు వ్యాధులను కూడా నయం చేసే గుణాలు కూడా ఉన్నాయని వెల్లడైంది.

శరీర కణాల్లోని దెబ్బతిన్న డీఎన్‌ఏను రక్షించడంలో గోమూత్రం ఉపయోగపడుతుంది. గోమూత్రం తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండె పనితీరు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఆవు పాలు, ఆవు నెయ్యి తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలు చేకూరుతాయి. అప్పుడప్పుడూ గోమూత్రం తీసుకున్నా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

గోమూత్రం తీసుకోవడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు లేవు. పరగడుపున గోమూత్రాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రాక్ సాల్ట్ తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి మరింత మేలు జరుగుతుంది.