18 ఏళ్లు దాటిన వాళ్లకు తీపికబురు.. రూపాయి ఖర్చు లేకుండా రూ.50 వేలు బెనిఫిట్?

మనలో చాలామంది వేర్వేరు పోటీలలో పాల్గొనడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ పోటీలలో పాల్గొనడం ద్వారా కొన్నిసార్లు ఊహించని స్థాయిలో లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం, ఆర్యజనని సంయుక్తంగా ఒక పోటీని నిర్వహిస్తున్నాయి. ది సీక్రెట్ ఆఫ్ వర్క్ పేరుతో ఈ పోటీ అమలవుతుండటం గమనార్హం. ఎవరైతే ఈ పోటీలో పాల్గొని విజేతలుగా నిలుస్తారో వాళ్లకు బహుమతులు లభిస్తాయి.

ఈ పోటీ జాతీయ స్థాయి క్విజ్ పోటీ కాగా 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పోటీలో పాల్గొనవచ్చు. https://www.ajcontest.org/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ క్విజ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గెలిచే అవకాశాలు పెరుగుతాయి.

ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వాళ్లు 50,000 రూపాయల వరకు బహుమతులు పొందే అవకాశం ఉండటంతో ఈ పోటీలో పాల్గొనే వాళ్లకు మరింత బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 120 పేజీలున్న కర్మయోగ పుస్తకాన్ని నేర్చుకుంటే ఈ పోటీలో సులభంగా విజేతలుగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ నెల 25న మొదటి రౌండ్ నిర్వహించి ఫైనల్ రౌండ్ కు ఎంపిక చేస్తారు.

1 నుంచి 10 వరకు ర్యాంక్ లు సాధించిన వాళ్లకు 50,000 రూపాయల చొప్పున ఫ్రైజ్ మనీ లభించనుండగా ర్యాంక్ తగ్గే కొద్దీ ఫ్రైజ్ మనీ తగ్గుతుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ పోటీకి ఎంపిక అయ్యే అవకాశాలు లేవు. ఈ పోటీలో పాల్గొనాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.