పాలిచ్చే తల్లులు తినకూడని ఆహారాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

పాలిచ్చే తల్లులు ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే సంగతి తెలిసిందే. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పాలిచ్చే తల్లులు మిరపకాయలు, మసాలాలు, జంక్ ఫుడ్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆహారాలను తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.

గోధుమ రొట్టెలు, పాస్తా, తృణధాన్యాలు, ఓట్ మీల్ వంటివి పాలిచ్చే తల్లులకు మంచిది. టోఫు, చిక్కుళ్ళు, క్వినోవా వంటి మూలాల నుండి ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డైరీ లేదా ఫోర్టిఫైడ్ ప్లాంట్-ఆధారిత ఆహారాల నుండి కాల్షియం, విటమిన్ బీ12 తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుడ్లు పాలిచ్చే తల్లులకు అనువైన ఆహారం అని చెప్పవచ్చు.

కొబ్బరిలోని కొవ్వు శక్తిని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుందని చెప్పవచ్చు. అయితే పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి. మిరపకాయలు, మసాలాలు, అదనపు నూనె, జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి “గ్యాస్సీ ఫుడ్స్” కు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. కాఫీ, టీలకు పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు చాక్లెట్లను సైతం పరిమితంగా తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు వెల్లుల్లిని సైతం పరిమితంగా తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు పిప్పరమెంట్, సేజ్, పార్స్లీలకు కూడా దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలిచ్చే తల్లులు నారింజ, నిమ్మ, సిట్రస్ వంటి పండ్లకు దూరంగా ఉండాలి.