క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గడంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, చేపలు మరియు పులియబెట్టిన ఆహారాలు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. ఈ ఆహారాలలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని అధ్యయనాల ద్వారా వెల్లడవుతూ ఉండటం గమనార్హం
యాపిల్స్, బెర్రీలు, క్రూసిఫెరస్ కూరగాయలు, క్యారెట్లు, కొవ్వు చేపలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. చిలగడదుంప తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ దుంపను తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల బి6 విటమిన్ తో పాటు ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఈ లభిస్తాయి.
క్యారెట్, చిలగడ దుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధ పడేవాళ్ళు సైతం క్యారెట్, చిలగదుంపలను తీసుకుంటే మంచిది. చిలగడ దుంపలలో యాంటీ ఇన్ ఫలమేటరీ లక్షణాలు సైతం ఎక్కువగా ఉంటాయి. చిలగడ దుంపలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్ లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
చిలగడ దుంపలు తీసుకోవడం ద్వారా శరీర కణాల సామర్థ్యం పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి. చిలగడ దుంపలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.