దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ అదిరిపోయే పాలసీలను అందిస్తుండటం గమనార్హం. ఎల్ఐసీ పాలసీలలో ఆధార్ శిలా పాలసీ ఒకటి కాగా మహిళలకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బులను పొందవచ్చు.
నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఈ పాలసీకి పదేళ్ల నుంచి 20 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. 75,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. 30 సంవత్సరాల వయస్సు ఉంటే నెలకు 900 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
నెలకు 900 రూపాయలు పొదుపు చేస్తే 3 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. నెలకు రూ.1570 ప్రీమియం చెల్లిస్తే మాత్రం ఏకంగా 6 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆధార్ శిలా పాలసీ మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్.ఐ.సీ పాలసీల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ పాలసీలను తీసుకునే వాళ్లు ఈ పాలసీల గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే మంచిది.