మహిళల కోసం ఎల్‌ఐసీ కొత్త స్కీమ్.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు సొంతమయ్యే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న స్కీమ్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహిళల కోసం ఈ సంస్థ ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్ పేరుతో ఒక పాలసీని అమలు చేస్తుండగా కుటుంబానికి అండగా నిలవాలని భావించే మహిళలకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం కోరుకునే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రోజుకు కేవలం రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు సొంతమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 15 ఏళ్ల పాలసీ కాలానికి ఈ పాలసీని తీసుకుంటే సంవత్సరానికి రూ.31,755 చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునే వ్యక్తి చెల్లించే మొత్తంతో పోల్చి చూస్తే రెట్టింపు మొత్తంగా ఏకంగా 11 లక్షల రూపాయలు పొందవచ్చు.

మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పవచ్చు. డబ్బును పొదుపు చేయాలని భావించే మహిళలకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పాలసీదారు మరణిస్తే పాలసీపై లాయల్టీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. కనీస పాలసీ వ్యవధి పదేళ్లు కాగా గరిష్ట పాలసీ వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లను అందించి సులువుగా ఈ పాలసీని తీసుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ ఏజెంట్ ను సంప్రదించడంతో పాటు ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పవచ్చు.