బ్రిస్క్ వాక్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే.. ఈ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది బ్రిస్క్ వాక్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గుండె ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడటంలో బ్రిస్క్ వాక్ ఉపయోగపడుతుంది. బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా బరువు సులువుగా తగ్గే అవకాశం ఉంటుంది. వేగంగా నడవడం ద్వారా ఆందోళన, నిరాశ, ఒత్తిడి తగ్గుతాయి. వేగంగా నడవడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్సిన్లు విడుదలవుతాయి.

బ్రిస్క్ వాక్ చేయడం వల్ల శాస సంబంధిత సమస్యలు దూరం కావడంతో పాటు శ్వాస వేగం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఊపిరితిత్తులను బలోపేతం చేయడంలో బ్రిస్క్ వాక్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల కీళ్లు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది.

బ్రిస్క్ వాక్ చేసేవాళ్లు వేగంగా నడవడం ద్వారా శరీరం దృఢంగా మారుతుంది. సాయంత్రం సమయంలో రోజూ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల మనిషి జన్యువుల్లో ఉండే ‘టెలోమియర్’ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. విభజన జరిగే కొద్దీ, టెలోమియర్ బలహీనపడుతూ వార్ధక్యానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి.

బ్రిస్క్ వాళ్లు చేసేవాళ్లు 20 సంవత్సరాల యవ్వనంగా ఉండి వృద్ధాప్య లక్షణాలు లేకుండా ఉంటారని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు 4 లక్షల మంది జన్యువులను ఈ పరిశోధనకు ఉపయోగించారని సమాచారం అందుతోంది.