ఇంటర్ అర్హతతో 200 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

Job-Vacancy

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా https://recruitment.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఇంటర్ విద్యార్హతను కలిగి ఉండటంతొ పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. హిందీలో మాత్రం నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చాలారోజుల క్రితమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా దరఖాస్తు చేసుకోవడానికి 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో వేగంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. హిందీ, ఇంగ్లీష్ విధానంలో ఈ పరీక్ష జరగనుండగా సీబీటీ ఆధారంగా అర్హతను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. హిందీ టైపింగ్ పై అవగాహన ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటే నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.