లక్షా 77 వేల వేతనంతో భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వాళ్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. నాన్‌ టీచింగ్‌ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

iimc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 9 నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్‌ ఎడిటర్‌, అసిస్టెంట్‌ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్‌ ఆఫీసరల్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ క్లర్క్‌ పోస్టులు సైతం భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం ఆగష్టు నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. జాబ్ ను బట్టి వేతనంలో స్వల్పంగా మార్పులు ఉండే ఛాన్స్ అయితే ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,77,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆన్‌లైన్‌ తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉండటం గమనార్హం. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.