ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని కలలు కనే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా సెప్టెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది.

upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా మొత్తం 82 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలు 67 ఉండగా క్యాబిన్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలు 15 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కియాలజీ/ ఇండియన్ హిస్టరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఉద్యోగానికి అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్యాబిన్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్ అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సడలింపులు ఉండనున్నాయి. అకాడమిక్ మార్కుల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.

100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 56,000 నుంచి రూ. 1.77 లక్షల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అదనపు బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.