ప్రతిరోజూ ఉదయం సమయంలో జీరా వాటర్ తాగడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వంటగదిలో కనిపించే ముఖ్యమైన దినుసులలో జీలకర్ర ఒకటి కాగా తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. జీలకర్ర వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని చెప్పవచ్చు. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీరా వాటర్ ద్వారా లభిస్తాయి.
యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న జీరా వాటర్ తీసుకోవడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జీరా వాటర్ తోడ్పడుతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా జీరా వాటర్ సహాయపడుతుంది. వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర నీరు తోడ్పడుతుంది.
గ్లాస్ నీటిలో వేసి జీలకర్ర గింజలను మరిగించి తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బరువు తగ్గాలనుకునేవారు జీలకర్ర నీరు తీసుకుంటే మంచిది. పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ జీలకర్ర నీరును తీసుకోవచ్చు. తిన్నది బాగా జీర్ణం అవ్వడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
బాడీని డిటాక్సీ ఫై చేయడానికి జీలకర్ర నీరు ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో జీలకర్ర నీరు సహాయపడుతుంది. చాలా సేపు జీలకర్రని నీళ్ళల్లో నానబెట్టడం వల్ల అవి ఉబ్బుతాయి అలానే బయో యాక్టివ్ కాంపౌండ్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఈ నీళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.