కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పశువుల బీమా పథకం ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం రైతు బీమా, పంట బీమాలను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ద్వారా రైతులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. చాలామంది రైతులు పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తుండటం గమనార్హం.
పశువులు ఏవైనా ఊహించని కారణాల వల్ల మరణించిన పక్షంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందనున్నాయి. ఈ స్కీమ్ కింద దేశీయ పశువులతో పాటు క్రాస్ బ్రీడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందనుందని తెలుస్తోంది. పాడి ఆవులతో పాటు ఎడ్లు, పడ్డలు, దూడలు, గేదెలకు ఈ స్కీమ్ ద్వారా బీమా సదుపాయం ఉంది. ఈ బీమా తీసుకోవాలని భావించే వాళ్లు పశువు మార్కెట్ విలువకు 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధంగా రైతులు ప్రీమియం చెల్లిస్తే పశువులు చనిపోయిన సమయంలో మొత్తం డబ్బును పొందే అవకాశం ఉంటుంది. పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువతో పోల్చి చూస్తే 75 శాతం లభించే అవకాశం ఉంటుంది. తుపానులు, భూకంపాల వల్ల పశువులు చనిపోయినా కూడా పరిహారాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వ్యాధుల వల్ల పశువులు చనిపోయినా కూడా బీమా మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. పశువు మార్కెట్ విలువ, పశువు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు, పశువు వయస్సు, పశువు ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే పత్రం సమర్పించడం ద్వారా బీమా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.