ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. రూ.4 వేల బోనస్ పొందే ఛాన్స్!

govt-employees-leave-1585293788

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. త్వరలో వరుసగా పండుగలు ఉండనున్న నేపథ్యంలో అడ్వాన్స్ శాలరీ బెనిఫిట్ ను కేంద్రం తెచ్చింది. పెన్షనర్లు ముందుగానే పెన్షన్ పొందే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ నుంచి ఇందుకు సంబంధించిన మెమరాండమ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే వేతనాలు అందేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఆగష్టు, సెప్టెంబర్ నెల వేతనాలు ఈ ఉద్యోగులకు ముందుగానే జమ కానున్నాయి.

ఆగష్టు నెల 25వ తేదీన, సెప్టెంబర్ నెల 27వ తేదీన పండుగల సందర్భంగా ముందుగానే వేతనాలు జమ కానుండటంతో భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ పేమెంట్ ను కేంద్రం అడ్వాన్స్ పేమెంట్ గా ఇవ్వనుండగా తర్వాత రోజుల్లో వచ్చే జీతాన్ని బట్టి పూర్తి వేతనంలో అడ్జస్ట్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిర్ణయం విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్న ఉద్యోగులకు అదనంగా 4 వేల రూపాయలు ఇవ్వనుంది. ఎవరైతే ఈ బోనస్ పొందరో వాళ్లకు స్పెషల్ ఫెస్టివల్ అలవెన్స్ కింద రూ. 2750 జమ చేయనుంది. పెన్షనర్లకు మాత్రం అదనంగా 1000 రూపాయలు లభించనుంది. త్వరలో 2024 ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.