మనలో చాలామంది రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకటి కచ్చితంగా కలిగి ఉంటారు. అయితే ఈ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నవాళ్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మోదీ సర్కార్ కొత్త సర్వీసులను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుండగా ఈ సర్వీసుల వల్ల ఎంతగానో బెనిఫిట్ కలగనుంది. కొంతమంది ఒక్కో కార్డ్ లో అడ్రస్ ఒక్కో విధంగా ఉండటం వల్ల ఇబ్బంది పడతారు.
ఈ కార్డులలో అడ్రస్ ను మార్చుకోవాలని భావించినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే కేంద్రం కొత్త సర్వీసుల సహాయంతో ఇకపై సులువుగా అడ్రస్ ను మార్చుకోవచ్చు. కొత్త టెక్నాలజీతో సర్వీసులను కేంద్రం తీసుకురానుందని ఈ సర్వీసుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. ఈ సిస్టమ్ ద్వారా ఆధార్ లో ఉండే అడ్రస్ ఇతర డాక్యుమెంట్లకు వర్తించనుంది.
ఇప్పటికే ఈ కార్డులను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అన్ని శాఖలతో మాట్లాడి కేంద్రం ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిద్ధమైంది. మోదీ సర్కార్ ప్రజలకు పనులను సులువు చేసే దిశగా అడుగులు వేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ గుర్తింపు కార్డులు మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతున్నాయి.
కొత్త ఫ్లాట్ ఫామ్ మీదకు పది మంత్రిత్వ శాఖలను తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మోదీ సర్కార్ కొత్త ప్లానింగ్ తో ముందుకు వెళుతుండటం గమనార్హం. మోదీ సర్కార్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.