మహిళల కోసం మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఆరు అద్భుతమైన స్కీమ్స్ ఇవే!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ వల్ల మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. మహిళల కోసం కేంద్రం ఉమెన్ హెల్ప్ లైన్ స్కీమ్ ను అమలు చేస్తుండగా హింసకు గురైన మహిళలు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ను పొందవచ్చు. 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 

మహిళల కోసం కేంద్రం వన్ స్టాప్ సెంటర్ అనే మరో స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా హింస ద్వారా బాధింపబడ్డ మహిళలకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. నిర్భయ్ ఫండ్ ద్వారా కేంద్రం మహిళలకు ఈ స్కీమ్ తో బెనిఫిట్ కలిస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో సఖి నివాస్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.

 

ఉద్యోగం చేస్తున్న మహిళలకు వసతి కల్పించడంతో పాటు వాళ్ల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ స్కీమ్ అమలవుతోంది. అన్ని కులాల మహిళలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లల కోసం కేంద్రం బేటీ బచావో బేటీ పడావో పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.

 

చదువుకోవాలని భావించే ఆడపిల్లలకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆడపిల్లల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను అమలు చేస్తోంది. పదేళ్ల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఏడాదికి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ పత్ర పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ లో 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. 7.5 శాతం వడ్డీ రేటుతో అమలవుతున్న ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.