షవర్మా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. షవర్మా ఎక్కువగా తింటే ప్రాణాలే పోతాయా?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన షవర్మా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు షవర్మాను ఇష్టంగా తింటున్నారనే సంగతి తెలిసిందే. నాన్ వెజ్ ప్రియులకు సైతం షవర్మా ఎంతగానో నచ్చుతుంది. అయితే తాజాగా కేరళలో ఒక వ్యక్తి షవర్మా తినడం వల్ల చనిపోయాడు. షవర్మా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఈ వ్యక్తి మృతి చెందాడు. షవర్మా తినడం వల్ల కడుపులో నొప్పి, వాంతులు, వికారం, ఇతర సమస్యలు ఎదురవుతాయి.

షవర్మాను ఓవర్ గా కుక్ చేయడం వల్ల ఇందులో విష పదార్థాలు చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. షవర్మా ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు సమస్యలు, బరువు సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డయారియా, కడుపులో నొప్పి, వాంతులు, వికారం లాంటి సమస్యలకు సైతం షవర్మా కారణమవుతుంది. షవర్మా ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.

కుళ్లిన, పాడైన షవర్మాను ఎవరైనా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. షవర్మా తిని అస్వస్థతకు గురైన వాళ్లు సైతం ఉన్నారు. షిగెల్లాతో పాటు సర్మోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఇందులో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రుచిగా ఉందని షవర్మాకు ఆకర్షితులు అయితే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పిల్లలకు షవర్మా పెట్టేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పిల్లలు షవర్మా తింటే చిన్న వయస్సులోనే వేర్వేరు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. షవర్మా ఒకటి రెండుసార్లు రుచి కోసం తింటే తప్పు లేదు అదే పనిగా తింటే మాత్రం ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు.