ఉప్పును ఇలా తీసుకుంటే గుండె, కిడ్నీ సమస్యలకు చెక్.. పాటించాల్సిన చిట్కాలివే!

మనలో చాలామంది వంటకాలలో ఉప్పును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన మోతాదు ప్రకారం ఉప్పును తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. గుండె, కిడ్నీ వ్యాధులకు ప్రధానంగా ఉప్పు కారణమని చెప్పవచ్చు. నిల్వ ఉన్న పచ్చళ్లను ఎక్కువ కాలం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంది.

మన దేశంలో ఉప్పుకు సంబంధించి చాలామంది నిపుణులు సరైన సూచనలు ఇవ్వడం లేదు. ఉప్పు ఖరీదు తక్కువ కావడం వల్ల కూడా ఉప్పు వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ప్యాకింగ్ చేసిన ఆహారాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఎక్కువ మొత్తంలో ఉప్పును వినియోగిస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 సంవత్సరం నుంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా ఆహారంలో సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం గమనార్హం. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

ఉప్పు తీసుకునేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉప్పు తీసుకునే వాళ్లు ఎక్కువగా తీసుకుంటే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి.