5 రూపాయల నోట్లు ప్రస్తుతం చలామణిలో లేవనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ నోట్ల ముద్రణ జరగడం లేదు. ట్రాక్టర్ బొమ్మ ఉన్న 786 నంబర్ తో కూడిన 5 రూపాయల నోటు ఉంటే సులువుగా లక్షాధికారి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నోటును ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ల ద్వారా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి నోట్లకు భారీ మొత్తంలో విలువ ఉంటుందని చెప్పవచ్చు.
చలామణిలో లేని నోట్లు అయినప్పటికీ కొంతమందికి ఈ అరుదైన నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ ఆఫర్ ఒక విధంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కొన్ని అరుదైన నోట్లకు లక్షల రూపాయలు రాకపోయినా వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో పాత నోట్లు, నాణేలకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
పాత నోట్లను జమ చేయడం హాబీగా మార్చుకుంటే దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్ అయితే కలుగుతుందని చెప్పవచ్చు. పాత నోట్లను ఎక్కువ సంఖ్యలో కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కొంతమంది కాయిన్లను దాచుకుని కూడా లక్షల్లో సంపాదించిన వాళ్లు ఉన్నారు. పాత 10 రూపాయల నోట్లకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.
కొన్ని నాణేలు, నోట్లకు నిజంగానే భారీ మొత్తం వస్తాయని ఈ నాణేలను సేకరించడంలో అనుభవం ఉన్నవాళ్లు చెబుతున్నారు. అయితే అరుదైన నాణేలు, నోట్లను కలిగి ఉంటే మాత్రమే ఎక్కువ మొత్తం విలువను కలిగి ఉంటాయి. స్వాతంత్రానికి పూర్వంకు సంబంధించిన నోట్ల విలువ ఎక్కువ మొత్తంగా ఉంటుంది.