భరించలేని నడుము నొప్పితో బాధ పడుతున్నారా.. సింపుల్ గా చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామందిని చిన్న వయస్సులోనే నడుము నొప్పి సమస్య వేధిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. సింపుల్ చిట్కాలతోనే నడుము నొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చు. నడుము నొప్పి వల్ల నిత్య జీవితంలో నరకం అనుభవిస్తున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

కొంతమంది నడుము నొప్పిని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా దీర్ఘకాలంలో ఇవి లాభాల కంటే ఎక్కువగా నష్టాలనే కలిగిస్తాయని చెప్పవచ్చు. నడుము నొప్పి సమస్యతో బాధపడే వాళ్లు మొదట టెన్షన్ ను తగ్గించుకుంటే మంచిది. రోజువారీ అలవాట్లను మార్చుకోవడంతో పాటు వెన్నెముక కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను అలవరచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ల కింద దిండును పెట్టుకుని నిద్రించడం ద్వారా సమస్య దూరమవుతుంది. కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్ సైజులు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తక్కువ మడమలు ఉన్న చెప్పులను ధరిస్తే ఆరోగ్యానికి మంచిది.

ఆఫీస్ లో కూర్చునే సమయంలో సరైన పొజిషన్ లో కూర్చోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు మంచి కుర్చీని ఎంచుకోవాలి. బరువును కంట్రోల్ చేసుకోవడం ద్వారా నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు.