ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ శిక్షణలో అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను కోరుతుండటం గమనార్హం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ శిక్షణను అందిస్తారు.
డిప్లొమా టెక్నీషియన్ ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలు 120 ఉండగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నాన్ ఇంజినీరింగ్ 120 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇతర విభాగాల అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు శిక్షణ వ్యవధి ఎకంగా ఏడాది పాటు ఉంటుంది. డిప్లొమా టెక్నీషియన్ అభ్యర్థులకు నెలకు 10,500 రూపాయలు వేతనం లభించనుండగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 11,5000 రూపాయలకు వేతనం లభించనుంది.
మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా 2024 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన వెల్లడి కానుంది. డిసెంబర్ నెల 18వ తేదీ నుంచి డిసెంబర్ నెల 20వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.