కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పెన్షన్ ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడిచే కొద్దీ పొందే పెన్షన్ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అంగవైకల్యం లేదా సర్వీసులో ఉండగా మరణించిన వారికి ఎక్కువ ప్రయోజనాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫ్యామిలీ పెన్షన్ ను పొందడానికి కొడుకులకు ఏ విధంగా అర్హత ఉంటుందో కూతుళ్లకు సైతం అదే విధంగా అర్హత ఉండనుంది.
ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు భార్యలు ఉండి ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ వివాహానికి చట్టబద్ధత ఉంటే మాత్రమే ఆ మహిళ, మహిళ కుటుంబ సభ్యులు పెన్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యుల వివరాలను సైతం వెల్లడించాల్సి ఉంటుంది.
కూతురు పెన్షన్ పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కూతురు అవివాహితగా విడాకులు తీసుకుంటే 25 సంవత్సరాల వయస్సు నిండి ఉంటే పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. పెళ్లైన కూతురుకు వైకల్యం ఉంటే పెన్షన్ పొందవచ్చు. వైకల్యం లేకుండా పెళ్లి జరిగితే పెన్షన్ విషయంలో అర్హత ఉండదు.
ఓపీఎస్ స్కీమ్ లో పని చేసిన వ్యక్తి చివరి జీతం ఆధారంగా పెన్షన్ ను లెక్కించడం జరుగుతుంది. సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా పెన్షన్ కు సంబంధించిన అన్ని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కూతుళ్లకు సైతం బెనిఫిట్ కలిగేలా పెన్షన్ రూల్స్ ఉండటం కొసమెరుపు.