ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పది పాసై ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. పది పాసైన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి.
2023 సంవత్సరం ఏప్రిల్ నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా మొత్తం 63 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 63 ఉద్యోగాలలో టెక్నీషియన్ ఉద్యోగాలు 30 కాగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 24, ఇతరులు 9 ఉన్నాయి.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోగట్టా. మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్‌లో డిప్లొమా ఉన్నవాళ్లు టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంచుకునే ఉద్యోగం ఆధారంగా వయో పరిమితిలో స్వల్పంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. isro.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
iprc.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడి కానున్నాయని బోగట్టా. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఇతర మార్గాల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.