ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బెంగుళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. isro.gov.in వెబ్ సైట్ ద్వారా ఇ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 224 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. మార్చి నెల 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 142 ఉండగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 55 ఉన్నాయి. సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 6, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. డ్రాఫ్ట్స్‌మన్ ఫైర్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా కుక్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. లైట్ వెహికల్ డ్రైవర్ జాబ్స్ 6 ఉండగా హెవీ వెహికల్ డ్రైవర్ జాబ్స్ 2 ఉన్నాయి.
అధికారిక నోటిఫికేషన్ కు అనుగుణంగా అర్హత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 56100 రూపాయల వేతనం లభించనుంది. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.
ఎక్కువ వేతనంతో ఉద్యోగం కోరుకునే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. ఇస్రోలో ఉద్యోగం చేయాలని దేశంలోని ఎంతోమంది కల కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆ కలను సులువుగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది.