మీ బంధం దీర్ఘకాలం పాటు సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ఇలాంటి సాన్నిహిత్యం ఉండాల్సిందే!

older-women-with-younger-men-relationship

ఇద్దరి మధ్య బంధం పదిలంగా ఉండాలంటే ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. ఈ విధంగా ఇద్దరి మధ్య బంధం ఒక బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ప్రేమ నమ్మకం పాటు వ్యక్తిత్వం కూడా ఉన్నప్పుడే వారి మధ్య ఉన్నటువంటి బంధం దీర్ఘకాలం పాటు సంతోషంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పాలి. సంతోషకరమైన జీవితానికి ప్రేమ ఒక్కటే ముఖ్యం కాదు వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు

కొంతమంది ఏ చిన్న విషయాన్ని అయినా భాగస్వామితో పంచుకోవాలని అనుకుంటారు. దీనివల్ల ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. అందుకు మనం మన భాగస్వామితో ఏ విషయాన్ని పంచుకోవాలి, ఏ విషయాన్ని పంచుకోకూడదు అన్నది కచ్చితంగా ముందుగా తెలుసుకోవాలి. మీరు మీ కాలేజీలో మీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాలను అలాగే ఇదివరకే మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల గురించి కూడా మీ భాగస్వామి దగ్గర చెబితే మీ బంధంలో సమస్యలు తలితే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి విషయాలను వారి దగ్గర చెప్పకపోవడమే మంచిది.

సాధారణంగా పెళ్లి బంధం తర్వాత మిగతా బంధాలకు దూరమవుతుంటారు. అయితే అది అంత మంచిది కాదంటున్నారు రిలేషన్ షిప్ మేనేజర్స్. ఎప్పుడు మీ భాగస్వామితో కాకుండా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం వల్ల మీకంటూ ఓ ప్రపంచం ఉంటుంది. మీ భాగస్వామితో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు స్నేహితులతో చెప్పుకోవడం వల్ల మనసు తేలికై అది మీ బంధాన్ని బలంగా ఉంచడానకి దోహదం చేస్తుంది. నీకు సంబంధించిన అన్ని పనులూ కలిసే చేసుకోవాలనుకోవడం మంచిదే. ఇక కొన్నిసార్లు మీ అభిరుచులు మీ జీవిత భాగస్వామితో కలవనప్పుడు అలాంటి విషయాలను వారి దగ్గర ప్రస్తావించకపోవడం మంచిది. ఇలా కొన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేయటం వల్ల మీ బంధం పదిలంగా ఉంటుంది.