Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే సమంత తన అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఈమె అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన తర్వాత సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా జీవిత భాగస్వామి గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు. మంచి బంధం నిజమైన ప్రేమ అన్ని రకాల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. మీ భాగస్వామి కోరుకున్న విధంగా కనిపించలేరు. ఎదుట మనకు కనిపించే వ్యక్తి చాలా అందంగా ఉన్నారని మాత్రమే తెలుస్తుంది కానీ వారి మనసు వారి ఆలోచనలు వారి శరీరం ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రం గుర్తించలేము.
ఇలాంటి పరిస్థితులలోనే మనం ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని కోల్పోవాల్సిందేనని సమంత జీవిత భాగస్వామి గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈమె నాగ చైతన్యను ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత కూడా పెళ్లి చేసుకుని తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఈమె తిరిగి జీవిత భాగస్వామి గురించి ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
