ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

బాడీ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. qcin.org వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 14వ తేదీన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా ఆగష్టు 4వ తేదీ చివరి తేదీగా ఉండటం గమనార్హం.

మొత్తం 553 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3వ తేదీన జరగనుందని సమాచారం అందుతోంది. వేర్వేరు రంగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 21 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించ్ అర్హత కలిగి ఉంటారు. జనరల్, ఓబీసీ వర్గాలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండనుందని మిగిలిన వాళ్లకు 500 రూపాయలుగా ఉండనుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

మెయిన్ పరీక్ష రాసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కుల వెయిటేజీ ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.