ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2.4 లక్షల వేతనంతో?

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 247 వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఉద్యోగ ఖాళీలతో పాటు మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

hindustanpetroleum.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా రిజర్వ్‌డ్ వర్గాలకు వయో పరిమితి సడలింపులు ఉండనున్నాయని తెలుస్తోంది.

ఓబీసీ అభ్యర్థులకు 1180 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. 2024 జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం నిరుద్యోగులకు ప్లస్ అవుతోంది. సంస్థ వెబ్ సైట్ ఓపెన్ చేసి అప్లై ఆన్‌లైన్ ఆప్షన్ ను ఎంచుకుని వివరాలు ఫిల్ చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసి గ్రూప్ టాస్క్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 2,40,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.