డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 650 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిఅ నియామకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఏడాది వ్యవధితో పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏడాది కోర్సులో 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలలు ఇంటర్న్ షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు శిక్షణ టైంలో నెలకు 5,000 రూపాయల వేతనం లభిస్తుంది.

ఇంటర్న్ షిప్ సమయంలో నెలకు 15000 రూపాయలు, ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి గరిష్టంగా 6.5 లక్షల రూపాయల వరకు వేతనం లభించ్నుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1050 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది.

ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.