నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు… ప్రభుత్వ రంగ సంస్థలో 1,683 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ 1683 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ ఇంజనీర్, నర్సింగ్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

https://sgpgims.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం జులై 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ జరగనుందని భోగట్టా. 2024 సంవత్సరం జులై 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 1,426 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఉండగా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1180 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 708 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే జాబ్ ఆధారంగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలను కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.