పది అర్హతతో పోస్టల్ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

గ్రామీణ డాక్ సేవక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వేర్వేరు పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి త్వరలో జాబ్ నోటిఫికేషన్ వెలువడనుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, డాక్ సేవక్ ఉద్యోగాలలో ఏదో ఒక జాబ్ లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు రోజుకు 4 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వేతనం లభిస్తుంది.

ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ఇన్సెంటివ్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని ఫీలయ్యే వాళ్లకు మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. కొన్ని నెలల క్రితమే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరగాల్సి ఉన్నా సార్వత్రిక ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది.

పదో తరగతిలో 10కు 10 జీపీఏ సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు సులువుగా ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమాన అర్హతలు ఉంటే మాత్రం వేర్వేరు అంశాల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపడతారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.