ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తల్లీదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో, పిల్లల అలవాట్ల విషయంలో తల్లీదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు తల్లీదండ్రులు ఫోన్ ను అలవాటు చేయకూడదు.
పిల్లలకు ఫోన్ ను ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేయకూడదు. చిన్న వయస్సు నుంచి పిల్లలు ఫోన్ వాడితే పిల్లలకు కంటి సంబంధిత సమస్యలు రావడంతో పాటు చదువుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. పిల్లలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది. తల్లీదండ్రులు పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జంక్ ఫుడ్ వల్ల పిల్లల ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువల్ల పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టకూడదు. పిల్లలకు కార్బొనేట్ డ్రింక్స్ అలవాటు చేయడం మంచిది కాదు. పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు షుగర్ తో తయారు చేసిన ఉత్పత్తులను తినడం వాళ్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
బెల్లం, బ్రౌన్ షుగర్ ను ఉపయోగించడం ద్వారా పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. పిల్లలను టీవీకి దూరంగా ఉంచడం వల్ల పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. పిల్లలు గేమ్స్ ఆడేలా చూసుకోవడంతో పాటు పిల్లలు ప్రతిరోజూ కూరగాయలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.