మనలో చాలామందికి శనగపిండి విషయంలో వేర్వేరు అపోహలు ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండే శనగపిండి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం ఉండదు. శనగపిండి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. శనగపిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఇది తీసుకుంటే ఎలాంటి అలర్జీ కలగదు.
శనగపిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. డయాబెటిస్ రోగులు శనగపిండితో చేసిన వంటకాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శనగపిండితో చేసిన రోటీలు, పరోఠాలు ఎంతో రుచిగా ఉంటాయి. శనగపిండి బీపీ లెవెల్స్ ను అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.
శనగపిండితో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులకు చెక్ పెట్టడంలో శనగపిండి సహాయపడుతుంది. గ్రోత్ హార్మోన్స్ ఎక్కువగా ఉండే శనగపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శనగపిండితో చేసిన వంటకాలు తరచూ తినడం వల్ల పిల్లలు తక్కువ సమయంలో హైట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
శనగపిండిలో ఉండే ఫోలేట్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఎర్ర రక్త కణాలను పెంపొందించడంలో శనగపిండి సహాయపడుతుంది. కడుపునొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు శనగపిండికి దూరంగా ఉంటే మంచిది. మల్టీ గ్రెయిన్ ఆటాతో కలిపి శనగపిండిని తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.