నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ 2023 తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 400ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో స్కేల్3 కోసం 100 ఉద్యోగ ఖాళీలు ఉండగా స్కేల్2 కోసం 300 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 6 నెలల ప్రొబేషన్ పీరియడ్‌ ఉండటంతో పాటు 2 సంవత్సరాల బాండ్ పై వాళ్లు సంతకం చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. 25 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఉద్యోగ ఖాళీల ఆధారంగా వయో పరిమితిలో తేడాలు ఉన్నాయి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. bankofmaharashtra.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 63,000 రూపాయల వేతనం లభించనుందని భోగట్టా.

బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగిస్తాయి.