స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 14582 ఉద్యోగ ఖాళీలకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు ఉద్యోగాలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనీ భావించే వాళ్లకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
జులై నెల 4వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఛాన్స్ ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్ కామ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ ఎం ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్ స్పెక్టర్ పోస్టులు, ఇన్ స్పెక్టర్, సెక్షన్ హెడ్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫిసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్, ఆఫీస్ సూపరిండెంట్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సోర్టింగ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లార్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 2025 ఆగస్టు 1 నాటికీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,500 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవచ్చు.