మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, కార్పెంటర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, ఇతర ట్రేడ్స్ లో 523 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. వేర్వేరు ట్రేడ్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతుండటం నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం జరుగుతుంది.

ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 14 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపులు ఉండగా మిగతా అభ్యర్థులు మాత్రం 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముంబై, ఠాణేతో పాటు పుణె, ఛత్రపతి శంభాజీ నగర్, నాగ్ పూర్, కొల్హాపూర్, నాసిక్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2025 సంవత్సరం జూన్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు.

జులై నెల 18వ తేదీన హాల్ టికెట్ల జారీ జరగనుండగా 2025 సంవత్సరం ఆగష్టు 2వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది.