ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూన్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 227 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో అమృత్ సర్ లో 35 ఉద్యోగ ఖాళీలు ఉండగా వడోదరలో 16, చెన్నైలో 176 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పాసైన జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం 55 శాతం మార్కులు ఉన్నా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 సంవత్సరం జూన్1 నాటికి 27 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
30,000 నుంచి 34,500 రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంది.