బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఏటీఎం కార్డ్ ను కలిగి ఉండటంతో పాటు ఏదో ఒక సందర్భంలో ఏటీఎం ద్వారా లావాదేవీలు చేసి ఉంటారు. గూగుల్ పే, ఫోన్ పే వల్ల ఈ మధ్య కాలంలో ఏటీఎం లావాదేవీలు తగ్గినా ఏటీఎం కార్డ్ యాక్టివ్ గా ఉంటే మాత్రమే గూగుల్ పే, ఫోన్ పే పని చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏటీఎం కార్డ్ ఉన్నవాళ్లకు చితంగా రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది.
ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై ఈ ఆఫర్ ఉండగా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లను సంప్రదించి మీ ఏటీఎం కార్డ్ పై ఈ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. లక్ష రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డ్ కు ఇన్సూరెన్స్ ఉండి ఆ వ్యక్తి చనిపోతే కొన్ని డాక్యుమెంట్లను అందించడం ద్వారా ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ డబ్బులను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
నామినీ వివరాలు, క్లెయిమ్ ఫామ్ వివరాలు, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్, డెబిట్ కార్డ్ వివరాలను అందించడం ద్వారా నామినీ సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నాయి.
బ్యాంక్ అకౌంట్ ఇప్పటివరకు లేకపోతే సులువుగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉండి రూపే డెబిట్ కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రం 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఏటీఎం కార్డ్ లలో హైఎండ్ కార్డ్ ఉన్నవాళ్లు ఏటీఎం కార్డుల ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.