పంటి నొప్పితో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో పంటి నొప్పి సమస్య వేధిస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న జామ ఆకులు పంటి సంబంధిత సమస్యలను సులభంగా దూరంగా చేస్తాయి. జామ ఆకులను నమలడం లేదా వేడి నీటిలో జామ ఆకులను వేసి మౌత్ వాష్ లా వాడటం ద్వారా కూడా పంటి నొప్పి దూరమవుతుంది.

పంటినొప్పికి సులువుగా చెక్ పెట్టే వాటిలో లవంగం కూడా ఒకటి. లవంగంలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుందనే సంగతి తెలిసిందే. యూజీనాల్ ద్వారా పంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. లవంగం నూనెలో పొద్దు తిరుగుడు నూనెను కలిపి అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెల్లుల్లి సైతం పంటి నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి పేస్ట్‌లా తయారు చేసి పంటి నొప్పి ఉన్నచోట అప్లై చేస్తే మంచిది. తాజా వెల్లుల్లి రెబ్బలను నమలడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించి కూడా పంటి నొప్పిని దూరం చేసుకోవచ్చు. చిగుళ్ళలో రక్తస్రావాన్ని నయం చేయడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

నీటితో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలిపి ఉపయోగించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా కూడా పంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలు, మురికిని తొలగించడానికి ఉప్పు నీళ్లు తోడ్పడతాయి. ఈ చిట్కాలు పాటించి పంటి నొప్పికి చెక్ పెట్టవచ్చు.