ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 484 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 484 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ecil.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

484 ఐటీఐ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 80, ఆర్ అండ్ ఏసీ ఉద్యోగ ఖాళీలు 20, టర్నర్ పోస్టులు 20, ఈఎం ఉద్యోగ ఖాళీలు 190 ఉన్నాయి. మెషినిస్ట్ ట్రేడ్ ఉద్యోగ ఖాళీలు 15 ఉండగా మెషినిస్ట్ (జి) ఉద్యోగ ఖాళీలు 10, వెల్డర్ పోస్టులు 25, పెయింటర్ ఉద్యోగాలు 4 ఉన్నాయి.

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు ఫీజును డిపాజిట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

https://www.ecil.co.in/ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎక్కువ మొత్తంలో వేతనం లభించనుంది.