ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మేలు చేస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను ప్రారంభించాయి. joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా బీటెక్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెన్ జులై 16వ తేదీన ప్రారంభం కానుండగా ఆగస్టు 14 దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.
ఇండియన్ ఆర్మీ 379 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది. ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ ఏప్రిల్ లో ఇందుకు సంబంధించిన కోర్సు ప్రారంభం కానుంది. 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కగా మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉండనుందని సమాచారం అందుతోంది.
సెంట్రల్ రైల్వేస్ డివిజన్ 2,424 అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ మొదలుపెట్టగా పది లేదా అందుకు సమానమైన పరీక్షలో 50 శాతం మార్కులతో పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. rrccr.com వెబ్ సైట్ లో ఆగష్టు నెల 15వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ విభాగాలతో పాటు ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరగనుంది.
వేర్వేరు రంగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ వెల్లడైన నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్లపై దృష్టి పెడితే భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.